ప్రజారోగ్యం - పారిశుద్ధ్యం - అంటువ్యాధులు - ఆరోగ్య పథకాలు
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల పోషక, జీవన స్థాయులను మెరుగుపరచాలని మన
రాజ్యాంగం నిర్దేశిస్తోంది. దీనికి అనుగుణంగా భారత పార్లమెంట్ 1983లో జాతీయ
ఆరోగ్య విధానాన్ని ప్రకటించింది. దీనికి 2002లో కొన్ని మార్పులు చేశారు.
దేశంలో ప్రజారోగ్య వ్యవస్థలతో పాటు ప్రైవేట్ ఆరోగ్య సేవలు కూడా పెరిగాయి.
గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ప్రైవేట్ వైద్య సేవలపైనే
ఆధారపడ్డారు.
|
గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో వైద్యులు నాలుగురెట్లు ఎక్కువగా ఉన్నారు. నర్సులు మూడు రెట్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నారు. 80% వైద్య కళాశాలలు దక్షిణ, పశ్చిమ భారతదేశంలోనే ఉన్నాయి. మధ్య, ఈశాన్య, ఉత్తర భారత దేశాల్లోని గ్రామాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో లేవు. జాతీయ కుటుంబ సర్వే - 3 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 63% కుటుంబాలు ప్రైవేట్ వైద్యంపైనే ఆధారపడ్డాయి.
గ్రామీణులు
ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. సరైన సమయాల్లో వర్షాలు పడని
కారణంగా గ్రామాల్లో పేదరికం ఎక్కువగా ఉంది. 37% మంది గ్రామీణులు ఆకలితో
అలమటిస్తూ ఉన్నారు. 52% మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
బాలికల జీవితాలను ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో
కేవలం 7% మంది బాలురకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం పోషకాహారం
లభిస్తోంది.
|
![]() |
2009లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం
43.9% మంది మహిళలు ప్రసవానంతరం 6 వారాల తర్వాత తీవ్ర అనారోగ్యానికి
గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులుగా ఉంటూ మృతి చెందుతున్న వారి
సంఖ్య ప్రపంచంలో భారత గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ. భ్రూణ హత్యలు,
బాలింతల ఆరోగ్యం చాలా విపత్కర పరిస్థితుల్లో ఉన్నాయి. 10% మంది చిన్నారులు
ఏడాదిలోపే మృతి చెందుతున్నారు.
వివిధ ఆరోగ్య సమస్యల వల్ల దేశంలో నవజాత శిశువుల మరణాలు 9.6%గా ఉంటున్నాయి.
ఐదేళ్ల లోపు చిన్నారుల్లో 4% మంది మృత్యువాత పడుతున్నారు. టైమ్స్ గ్లోబల్
రిపోర్ట్ (2006) ప్రకారం దేశంలో ప్రతి 100 మంది శిశువుల్లో 6 నుంచి 7 మంది
పిల్లలు పుట్టుకతోనే వివిధ లోపాలతో జన్మిస్తున్నారు. దేశం మొత్తం మీద ఏటా
ఇలా జన్మించేవారి సంఖ్య 17 లక్షలు. సకాలంలో సరైన చికిత్సలు చేయకపోవడం వల్ల
10% మంది పిల్లల్లో దృష్టి, వినికిడి, మేథోపరమైన లోపాలు తలెత్తుతున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు గ్రామీణ ప్రాంతాల్లో 3 స్థాయుల్లో వైద్య సేవలను అందిస్తున్నారు.
అవి 1) సబ్ సెంటర్లు
2) ప్రైమరీ హెల్త్ సెంటర్లు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు)
3) కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు
అవి 1) సబ్ సెంటర్లు
2) ప్రైమరీ హెల్త్ సెంటర్లు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు)
3) కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు
జాతీయ ఆరోగ్య విధానం - 2003
భారతదేశంలో మొదటి జాతీయ వైద్య విధానాన్ని 1983లో ప్రకటించారు. 2003లో రెండో జాతీయ వైద్య విధానాన్ని ప్రకటించారు. ప్రజల జీవనం మెరుగ్గా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వీటిని అమలు చేస్తోంది. ప్రజారోగ్యం కోసం నిధులను పెంచింది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి వివిధ జాతీయ ప్రజారోగ్య కార్యక్రమాలను రూపొందించింది. |
![]() |
![]() |
సార్వత్రిక శిశు ఆరోగ్య పరీక్షల పథకాన్ని మహారాష్ట్రలోని థానే జిల్లాలోని
పాల్ఘర్‌లో సోనియాగాంధీ 2013 ఫిబ్రవరి 6న ప్రారంభించారు. పిల్లల్లో
పుట్టుకతో వచ్చే లోపాలను, పోషకాహార లోపం వల్ల కలిగే అవలక్షణాలను సత్వరమే
గుర్తించి సరైన చికిత్స అందించడం దీని లక్ష్యం. దీని ద్వారా దేశంలోని 27
కోట్ల మంది చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు లోపాలను
గుర్తించి సరిచేస్తారు.
|
జాతీయ
గ్రామీణ ఆరోగ్య పథకంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని దశల వారీగా దేశవ్యాప్తంగా
అమలు చేయనున్నారు. పిల్లలకు పౌష్ఠికాహార లోపం అతిపెద్ద సమస్య. దేశంలో 40%
మంది పిల్లలు ఇప్పటికీ పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్నారు.
సార్వజనీన శిశు ఆరోగ్య పరీక్షల పథకం కింద పిల్లల్లో తరచూ తలెత్తే 30 రకాలైన ఆరోగ్య సమస్యలను గుర్తించి, తగు చికిత్సలు చేస్తారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 8 సంవత్సరాల పిల్లలకు వివిధ దశల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ పథకం అమలు విధానం అంగన్‌వాడీలు, ప్రభుత్వ, ప్రభుత్వ సహాయంతో నడిచే ప్రాథమిక పాఠశాలల్లో పేర్లు నమోదు చేసుకునే 6 ఏళ్లలోపు చిన్నారులకు సంచార వైద్య బృందాలు క్రమపద్ధతిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాయి. ఏడాదిలో ప్రతి చిన్నారికి కనీసం రెండుసార్లు వైద్య పరీక్షలు జరిగేలా చూస్తారు. దీనికోసం ఆయుష్ వైద్యబృందాల సేవలను వినియోగిస్తారు. నవజాత శిశువులకు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇంటింటినీ సందర్శించే 'ఆశా' ఆరోగ్య కార్యకర్తల ద్వారా వైద్య పరీక్షలు చేయిస్తారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఈ వైద్య పరీక్షల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటవుతున్నాయి. ఇవి వివిధ సాంక్రమిక వ్యాధులపై సమాచారాన్ని క్రోఢీకరిస్తాయి. భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలను అందించడానికి దీన్ని వినియోగిస్తారు.

ప్రజారోగ్య రంగంలో మైలురాళ్లు
1949
భారత రాజ్యాంగ నిబంధన ప్రకారం ఆరోగ్య విషయాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర జాబితాల రూపకల్పన.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో నెలకొల్పారు.1953
మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా జాతీయ మలేరియా నియంత్రణ కార్యక్రమం, దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాల నిర్వహణ.1954
పార్లమెంటు కల్తీ నివారణ చట్టాన్ని ఆమోదించింది.
1948
![]() ![]() ![]() |
![]() |

No comments:
Post a Comment