Thursday 6 February 2014

1959 డాక్టర్ మొదలియార్ కమిటీ నియామకం.
 పోషకాహార పరిశోధనా సంస్థను కూనూరు నుంచి హైదరాబాదుకు తరలించారు.
 మశూచి వ్యాధిని నిర్మూలించాలని జాతీయ వైద్య మండలి సిఫారసు చేసింది. బెంగళూరులో జాతీయ క్షయవ్యాధి సంస్థను నెలకొల్పారు.

1960
 పాఠశాల బాలబాలికల ఆరోగ్య పోషణకు సంబంధించిన స్థితిగతుల పరిశీలనకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. గణాంకాల విభాగాన్ని ఆరోగ్యశాఖ నుంచి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి బదిలీ చేశారు.1961 మూడో పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్యానికి రూ.342 కోట్లు కేటాయించారు. 'మొదలియార్ కమిటీ' నివేదిక సమర్పించింది.1962 కేంద్ర కుటుంబ నియంత్రణ సంస్థను నెలకొల్పారు. జాతీయ మశూచి నిర్మూలన కార్యక్రమం ఏర్పాటైంది. పాఠశాల ఆరోగ్య కార్యక్రమం, జాతీయ గాయిటర్ కార్యక్రమం, జిల్లా క్షయవ్యాధి నియంత్రణ కార్యక్రమాలను ప్రారంభించారు.
1963
 ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార వ్యవసాయ సంస్థ సహాయంతో యునిసెఫ్, 'అనువర్తిత పోషకాహార కార్యక్రమం'ను ప్రారంభించింది.
 జాతీయ ట్రకోమా నియంత్రణ కార్యక్రమం, జాతీయ విస్తృత కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను ప్రారంభించారు.
 చెడ్డా కమిటీ నివేదికను అనుసరించి ప్రతి పదివేలమంది జనాభాకు ఒక మౌలిక ఆరోగ్య కార్యకర్తను నియమించారు.
1964 ఆరోగ్యపాలన విద్య కోసం జాతీయ సంస్థను నెలకొల్పారు. గర్భస్రావాలను చట్టబద్ధం చేసేందుకు వీలుగా 'శాంతీలాల్ షా' కమిటీని ఏర్పాటు చేశారు.1969 నాలుగో పంచవర్ష ప్రణాళికలో ఆరోగ్య కార్యక్రమాలకు రూ.840 కోట్లు, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు రూ.315 కోట్లు కేటాయించారు. హైదరాబాదులోని పోషకాహార సంస్థను 'జాతీయ పోషకాహార సంస్థ'గా పరిగణించారు. కేంద్ర జనన, మరణ చట్టాన్ని ఆమోదించారు.
1972 1972 ఏప్రిల్ 1 నుంచి జనన, మరణాల చట్టం అమల్లోకి వచ్చింది.
1973
 గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, పోషకాహార కార్యక్రమాల నిర్వహణ కోసం బహుళార్థ ఆరోగ్య కార్యకర్తలను నియమించడానికి వీలుగా 'కర్తార్ సింగ్' కమిటీ నివేదికను సమర్పించింది.1974 అయిదో పంచవర్ష ప్రణాళిక ప్రారంభంలో ఆరోగ్య కార్యక్రమాలకు రూ.796 కోట్లు, కుటుంబ నియంత్రణ కార్యక్రమాలకు రూ.516 కోట్లు కేటాయించారు. మలేరియా నియంత్రణ కోసం నూతన పథకాన్ని ప్రతిపాదించారు.
 ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకున్నారు.
1975 1975 జులై 5 నుంచి దేశంలో మశూచి వ్యాధిని నిర్మూలించారు.1976 కేంద్రప్రభుత్వం ఆహార కల్తీ నివారణ చట్టంలో జాతీయ జనాభా విధానాన్ని ప్రతిపాదించింది. జాతీయ అంధత్వ కార్యక్రమాన్ని రూపొందించారు.
1977 భారతదేశం మశూచి వ్యాధి నుంచి స్వేచ్ఛ పొందినట్లు అంతర్జాతీయ కమిషన్ ప్రకటించింది.
1992
 ఎయిడ్స్ వ్యాధి నివారణకు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ మొదటిదశ
(1992 - 99)ను ప్రారంభించారు.
2005  గ్రామీణ ప్రజానీకానికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడానికి కేంద్రం 'జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ను ప్రారంభించింది.2012 2012 ఫిబ్రవరి 24న పోలియో పీడిత దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.2013 శిశువుల్లో పుట్టుకతో వచ్చే లోపాల చికిత్సకు 2013 ఫిబ్రవరి 6న 'రాష్ట్రీయ బాల స్వాస్థ్య యోజనను ప్రారంభించారు
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ వ్యయంతో నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ను ప్రారంభించారు. అణగారిన వర్గాలకు ఈ సేవలు అందిచడమే దీని ప్రధాన లక్ష్యం. 2005లో ఈ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ మిషన్ పనిచేస్తుంది.
 మాతృ మరణాల రేటును 407 నుంచి 100కు తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించారు. (ప్రతి లక్ష జననాలకు ఈ గణన ఉంటుంది.)
 శిశు మరణాల రేటును ప్రతి 1000 జననాలకు 60 నుంచి 30కు తగ్గించాలి.
 7 సంవత్సరాల్లో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 3.0 నుంచి 2.1 సాధించడమే మిషన్ లక్ష్యం.
 ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ 2005, ఏప్రిల్ 12న జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌ను ప్రారంభించారు. తొలిదశలో 18 రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు.పన్నెండో ప్రణాళిక కాలంలో జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ లక్ష్యాలు మాతృ మరణాల రేటును ప్రతి లక్షకు 100 కంటే తగ్గించడం. ప్రతి 1000 జననాలకు శిశు మరణాల రేటును 27 కంటే తగ్గించడం, టోటల్‌ఫెర్టిలిటీ రేటును 2.1కు తగ్గించడం. దేశంలో 250 జిల్లాల్లో ఫైలేరియాను పూర్తిగా తొలగించడం. కుష్ఠు వ్యాధిని దేశవ్యాప్తంగా లేకుండా చేయడంతో పాటు 514 బ్లాకుల్లో కాలా అజార్‌ను నిర్మూలించడం. మలేరియా సోకే పరిస్థితిని ప్రతి వెయ్యి మందిలో ఒకరి కంటే తక్కువ ఉండేలా చూడటం.
 డెంగీ జ్వరాన్ని 1% కంటే తక్కువ ఉండేలా చూడటం.
జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ లక్ష్యాల సాధనకు వ్యవస్థలుకేంద్రస్థాయి వ్యవస్థ మిషన్ స్టీరింగ్ గ్రూప్, కార్యక్రమ సాధికారత కమిటీ (ఎంపవర్డ్ ప్రోగ్రాం కమిటీ)లను నెలకొల్పారు. మిషన్ స్టీరింగ్ కమిటీకి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి నేతృత్వం వహిస్తారు.రాష్ట్ర స్థాయి వ్యవస్థ రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ఆరోగ్య మిషన్ పనిచేస్తుంది. పథకం అమలును రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుంది.జిల్లాస్థాయి వ్యవస్థ జిల్లా స్థాయిలో జిల్లా ఆరోగ్యమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. జిల్లా పరిషత్తు ఛైర్మన్ దీనికి నేతృత్వం వహిస్తారు. సంబంధిత జిల్లా కలెక్టర్ సహాయకారిగా ఉంటారు. జిల్లా వైద్య అధికారి మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ప్రతి జిల్లాలో సమీకృత ఆరోగ్య సొసైటీని ఏర్పాటు చేస్తారు. ఈ సొసైటీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలకు ప్రణాళికలను రూపొందించడంతో పాటు నిర్వహణ బాధ్యతలను కూడా చూస్తుంది. 



No comments:

Post a Comment