Thursday 6 February 2014

జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ కింద ఏర్పాటైన పథకాలు               గర్భధారణ సమస్యల మూలంగా దేశంలో ఏటా 56,000 మంది మహిళలు మృతి చెందుతున్నారు. సుమారు 13 లక్షల మంది చిన్నారులు సంవత్సరంలోపే మృత్యువాత పడుతున్నారు. ఇందులో 9 లక్షల మంది నెలలోపే మరణిస్తున్నారు. వీటిని తగ్గించడానికి జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్‌లో భాగంగా వివిధ పథకాలను ప్రారంభించారు.జననీ సురక్షా కార్యక్రమం
  మాతా సంరక్షణ కోసం ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రజారోగ్య కేంద్రాల్లో ప్రసవాలను ఉచితంగా నిర్వహిస్తారు.
 గర్భిణులను ఆసుపత్రికి తీసుకువచ్చిన దగ్గర నుంచి ప్రసవానంతరం ఇంటికి సురక్షితంగా చేరుస్తారు.
 అవసరమైతే ఉచిత సిజేరియన్ ఆపరేషన్ చేస్తారు. ఔషధాలను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు ఏడు రోజులు ఉచితంగా ఆహారం అందిస్తారు. సాధారణ ప్రసవం సందర్భంలో మూడు రోజుల పాటు ఉచిత ఆహారాన్ని అందజేస్తారు.
 1995లో ప్రారంభించిన జాతీయ మాతృ ప్రయోజన కార్యక్రమానికి కొన్ని మార్పులు చేస్తూ 2005, ఏప్రిల్‌లో జననీ సురక్షా యోజనను ప్రారంభించారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. మొత్తం ప్రసవాల్లో 25% కంటే తక్కువగా ఆసుపత్రుల్లో జరిగే రాష్ట్రాలను తక్కువ సామర్థ్య రాష్ట్రాలుగా వర్గీకరించారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రతినెలా 'ఆశా' ఆరోగ్య కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తారు.
శిశు సంరక్షణ పథకాలు
 నవజాత శిశువుల సంరక్షణకు 'న్యూ బార్న్ బేబీ కార్నర్స్‌'ను ఏర్పాటు చేశారు. నవజాత శిశు సురక్షా కార్యక్రమాన్ని కూడా ఇదే లక్ష్యంతో ప్రారంభించారు. ప్రసవ సమయంలో అప్రమత్తంగా ఉంటారు. దీనికోసం ఎంపిక చేసిన సిబ్బందికి ముందుగానే రెండు రోజులు శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందినవారు ప్రసవ సమయంలో అప్పుడే పుట్టిన చిన్నారులకు ఎలాంటి ఇన్‌ఫెక్షన్ రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు.                                             కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకాలునేషనల్ వెక్టర్ బార్, డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం మలేరియా, డెంగీ, ఫైలేరియా, కాలా అజార్, జపనీస్ ఎన్ సెఫలైటిస్, చికున్‌గన్యా లాంటి రోగాల నివారణకు ఈ పథకాన్ని రూపొందించారు.
నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం
 హెచ్.ఐ.వి. బాధితులకు సరైన వైద్య సహాయం అందించడం, ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి నివారణా చర్యలను చేపట్టడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
నేషనల్ రివైజ్డ్ టి.బి. కంట్రోల్ ప్రోగ్రాం డైరెక్ట్ అబ్జర్వ్‌డ్ ట్రీట్‌మెంట్ (DOT) ద్వారా క్షయ రోగులకు చికిత్స అందించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2006 మార్చి నాటికి దేశం మొత్తం ఈ పథకం విస్తరించింది.
నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రాం
 పొగాకు సంబంధిత, నోరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను నివారించడానికి, ప్రజల్లో అవగాహన కలిగించడానికి పథకాన్ని ప్రారంభించారు.
యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం ఈ పథకాన్ని 1985లో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ట్యుబర్‌క్యులోసిస్, డిఫ్తీరియా, పెర్టుసిస్, టెటనస్, పోలియో, మీజిల్స్ లాంటి 6 వ్యాధులు రాకుండా వ్యాక్సిన్లు అందిస్తారు.నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రాం 1992లో నేషనల్ గాయిటర్ కంట్రోల్ ప్రోగ్రాంను నేషనల్ అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ కంట్రోల్ ప్రోగ్రాంగా మార్చారు. అందరికీ అయోడిన్ ఉప్పు అందించడం లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. అయోడిన్ లోప నివారణలకు ఉద్దేశించిన పథకమిది
                                    అంటువ్యాధులు               శారీరక లేదా మానసిక అస్వస్థతను వ్యాధి అంటారు. అంటువ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అంటువ్యాధులు, పోషకాహార లోపం వల్లే ఎక్కువమంది మరణిస్తున్నారు.
                   అంటువ్యాధులు వ్యక్తుల నుంచి వ్యక్తులకు లేదా జంతువుల నుంచి మనుషులకు సూక్ష్మజీవులు, కీటకాల ద్వారా వ్యాపిస్తాయి. రోగకారక క్రిముల ఉత్పత్తి స్థానాలను నిర్మూలించి, వాటి ప్రసార మార్గాలను ఆటంకపరచి, మానవుల వ్యాధి నిరోధక శక్తిని పెంచడం ద్వారా అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టి పూర్తిగా నిర్మూలించవచ్చు.
ప్రత్యక్ష తాకిడి వాల్ల వ్యాపించే సంక్రమిత వ్యాధులు
               స్పర్శ; నోరు, ముక్కు నుంచి వచ్చే స్రావాల తుంపరను పీల్చడం; జంతువుల కాటు, గాయాల ద్వారా క్రిములు వ్యాపించడం ప్రత్యక్ష వ్యాపనం కిందకు వస్తాయి. కుష్ఠు, గజ్జి, ఇతర చర్మ వ్యాధులు స్పర్శ వల్ల వస్తాయి. క్షయ, మశూచి, జలుబు తుంపర పీల్చడం ద్వారా వ్యాపిస్తాయి.
  జలభయ వ్యాధి (రేబిస్) కుక్క కాటు ద్వారా వస్తుంది. ధనుర్వాతం గాయాల ద్వారా వ్యాపిస్తుంది. రోగి లేదా వాహకుడికి 120 - 150 సెం.మీ. దూరంలో ఉన్న వ్యక్తులకు అంటువ్యాధి సోకే అవకాశం ఉంది.
  రోగి మాట్లాడటం, దగ్గడం, తుమ్మడం వల్ల వచ్చే తుంపరల ద్వారా ఇవి వ్యాపిస్తాయి.
గాలి ద్వారా వ్యాప్తి చెందే సంక్రమిత వ్యాధులు               నోరు, ముక్కు నుంచి వెలువడిన తుంపరలు ఎండిపోయి గాలిలో తేలుతుంటాయి. వీటిలోని క్రిములు నేలపై పడి దుమ్ముతో కలిసిపోతాయి. అలాంటి గాలి పీల్చే వ్యక్తుల శరీరంలోకి సూక్ష్మజీవులు ప్రవేశించే అవకాశం ఉంది.
ఉదాహరణ: క్షయ, మశూచి, చిన్న అమ్మవారు.
నీటి ద్వారా వ్యాప్తి చెందే సంక్రమిత వ్యాధులు
               కలుషితమైన నీరు తాగడం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. పోలియో, కలరా, టైఫాయిడ్, జిగట విరేచనాలు, ఇతర వ్యాధులను వ్యాప్తి చేసే క్రిములు తాగే నీటి ద్వారా సంక్రమిస్తాయి. ముఖ్యంగా పల్లెల్లో తాగునీటికి నదులు, బావులు ప్రధాన ఆధారం. ఆయా స్థలాల్లో బట్టలు ఉతకడం, రోగులు స్నానాలు చేయడం, పశువులను కడగటం వల్ల నీరు కలుషితమవుతుంది. పట్టణాలు, మహానగరాల్లో తాగేనీటిని వడగట్టి, క్లోరినేషన్ ద్వారా ముందుగా శుభ్రపరచి కుళాయిల ద్వారా పంపిణీ చేస్తారు. ఈ పద్ధతిలో చాలావరకు నీటిలోని వ్యాధి కారక క్రిములు నశిస్తాయి.జంతువుల ద్వారా సంక్రమించే అంటువ్యాధులు               జంతువులు, మనుషుల మధ్య సహజంగా సంక్రమించే వ్యాధులను 'జూనోసిస్' అంటారు. దాదాపు 150 వ్యాధులు ఈ తరగతి కిందికి వస్తాయి. వీటివల్ల మనుషులు వ్యాధుల బారిన పడతారు. జంతు సంపద, వ్యవసాయానికి కూడా చాలా నష్టం జరుగుతుంది. 
.

No comments:

Post a Comment