Thursday 6 February 2014

27. 1978లో మైనారిటీ కమిషన్‌ను ఎలా ఏర్పాటు చేశారు?
జ: కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వు ద్వారా
28. ఐ.రా.స. మానవహక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది?
జ: 1946
29. భారత రాజ్యాంగంలోని ఏ నిబంధనలో వెనుకబడిన తరగతుల ప్రస్తావన ఉంది?
జ: 340
30. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యులను తొలగించే అధికారం ఎవరికి ఉంది?
జ: రాష్ట్రపతికి
31. కేంద్రంలో స్త్రీ సంక్షేమ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 1985
32. గ్రామీణ మహిళలు, పిల్లల అభివృద్ధికి 'డ్వాక్రా' పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం?
జ: ఇందిరా గాంధీ ప్రభుత్వం
33. మహిళా సంక్షేమంతో సంబంధం ఉన్న నిబంధన ఏది?
1) 15         2) 23        3) 42       4) పైవన్నీ
జ: పైవన్నీ
34. కిందివారిలో జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలిగా పనిచేసినవారెవరు?
1) మోహినిగిరి        2) పూర్ణిమా అద్వాని         3) జయంతి పట్నాయక్       4) అందరూ
జ: అందరూ
35. మన రాష్ట్రంలో 'మహిళా కమిషన్'ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
జ: 2005
36. 19వ శతాబ్దంలో స్త్రీ విమోచనోద్యమం ఎక్కడ ఎక్కువగా వ్యాప్తి చెందింది?
జ: అమెరికా
37. ఒక వర్గాన్ని ఎస్సీ జాబితాలో చేర్చే, తొలగించే అధికారం ఎవరిది?
జ: గవర్నర్‌ను సంప్రదించి రాష్ట్రపతి
38. 'వెట్టి చాకిరీ'ని నిషేధించిన నిబంధన ఏది?
జ: 23
39. అత్యాచారాలు జరిపిన వారి మీద 'సామూహిక జరిమానా' విధించే అధికారం ఎవరికి ఉంటుంది?
జ: రాష్ట్ర ప్రభుత్వం
40. ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ ఎవరు?
జ: మమతా శర్మ
41. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ ఎవరు?
జ: జస్టిస్ కె.జి. బాలకృష్ణన్

No comments:

Post a Comment