ఈ అసమానతల కారణంగా ప్రజలకే కాకుండా
పాలనాపరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం
వీఆర్‌వోలను సొంత గ్రామాలకు బదిలీ చేయడాన్ని నిలిపేసింది. జిల్లాల్లో
ఖాళీగా ఉన్న వి.ఆర్.ఒ. పోస్టులను సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ భర్తీ
చేస్తుంది.
కొన్ని గ్రామాలను కలిపి ఒక సముదాయం (క్లస్లర్)గా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లకు 17,008 వి.ఆర్.ఒ.ల అవసరం ఉంది. ప్రస్తుతం 14,800 మంది వి.ఆర్.ఒ.లు ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 21,943 గ్రామ పంచాయతీలను 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. 5,000 జనాభా ఉన్న రెండు, మూడు పంచాయతీలను ఒక క్లస్టరుగా ఏర్పాటు చేశారు.
ప్రతి క్లస్టరుకు ఒక కార్యదర్శిని నియమించాలి. ప్రతి క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. ప్రతి కార్యదర్శికి ఒక పెద్ద పంచాయతీ లేదా ఏడు చిన్న పంచాయతీలను అప్పగించాలి. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు గ్రామ కార్యదర్శిని కలవాలంటే 40-50 కిలోమీటర్లు ప్రయాణించాలి. అడవుల మధ్యలో ఉండే చిన్న పంచాయతీలకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు లేవు. కనీసం గ్రామానికి ఒక కార్యదర్శి చొప్పున ఉండాలంటే గతంలో మాదిరిగా పంచాయతీ, రెవెన్యూ శాఖలను ఏకం చేయాలి. మన రాష్ట్రంలో 1127 రెవెన్యూ మండలాలు, 1094 మండల పరిషత్‌లు, 21,943 గ్రామ పంచాయతీలు, 28,124 రెవెన్యూ గ్రామాలు, 26,614 నివాసిత గ్రామాలు, 1510 నివాసాలు లేని గ్రామాలు ఉన్నాయి.
» ప్రతి గ్రామసభ సంవత్సరానికి రెండు సార్లు సమావేశం కావాలి.
» సాలీనా పంచాయతీకి సంబంధించిన ఖాతాలు, ఆడిట్ నివేదికను గ్రామసభకు సమర్పిస్తుంది.
» గడిచిన ఏడాది పాలనా నివేదిక, కొత్త పనులకు సంబంధించిన ప్రతిపాదనతో పాటు కొన్ని ముఖ్య విషయాలను గ్రామసభ చర్చిస్తుంది.
» మురుగు కాలువల నిర్మాణం, వాటి నిర్వహణ.
» రోడ్లను శుభ్రపరచడం, చెత్తా చెదారం తొలగించడం. పాడుబడ్డ బావులు, కుంటలు, గుంతలను పూడ్చడం.
» ప్రజా మరుగుదొడ్లను ఏర్పాటు చేసి శుభ్రపరచడం, శ్మశానాలను నిర్వహించడం. దిక్కులేని శవాలను, పశువుల కళేబరాలను పాతిపెట్టడం.
» కలరా, మలేరియా లాంటి అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం.
» తాగునీరు సరఫరా చేయడం, జనన మరణాలను నమోదు చేయడం, పశుశాలలను ఏర్పాటు చేయడం.
పై పనులే కాకుండా గ్రామ పంచాయతీ కింది విధులను కూడా నిర్వహించవచ్చు.
» ధర్మశాలలు, విశ్రాంతి భవనాల నిర్మాణం, వాటి నిర్వహణ.
» రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో చెట్లను నాటి సంరక్షించడం.
» సాంఘిక, ఆరోగ్య, విద్యా వసతులను కల్పించడం.
» కుటీర పరిశ్రమలు, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం.
గ్రామ పంచాయతీ అధికారాలు
» కార్యనిర్వాహకుడు లేదా సర్పంచ్ రూపొందించిన బడ్జెట్‌ను గ్రామ పంచాయతీ ఆమోదించిన తర్వాత, దాన్ని డివిజినల్ పంచాయతీ అధికారికి సమర్పిస్తుంది.
డివిజినల్ పంచాయతీ అధికారి దానికి సవరణలు లేదా సూచనలు చేస్తూ ఒక నెలలోగా గ్రామ పంచాయతీకి పంపించాలి. ఆ సూచనలను పాటిస్తూ తిరిగి బడ్జెట్‌ను ఆమోదించే అధికారం మాత్రం పంచాయతీకే ఉంటుంది.
కొన్ని గ్రామాలను కలిపి ఒక సముదాయం (క్లస్లర్)గా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లకు 17,008 వి.ఆర్.ఒ.ల అవసరం ఉంది. ప్రస్తుతం 14,800 మంది వి.ఆర్.ఒ.లు ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 21,943 గ్రామ పంచాయతీలను 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. 5,000 జనాభా ఉన్న రెండు, మూడు పంచాయతీలను ఒక క్లస్టరుగా ఏర్పాటు చేశారు.
ప్రతి క్లస్టరుకు ఒక కార్యదర్శిని నియమించాలి. ప్రతి క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. ప్రతి కార్యదర్శికి ఒక పెద్ద పంచాయతీ లేదా ఏడు చిన్న పంచాయతీలను అప్పగించాలి. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు గ్రామ కార్యదర్శిని కలవాలంటే 40-50 కిలోమీటర్లు ప్రయాణించాలి. అడవుల మధ్యలో ఉండే చిన్న పంచాయతీలకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు లేవు. కనీసం గ్రామానికి ఒక కార్యదర్శి చొప్పున ఉండాలంటే గతంలో మాదిరిగా పంచాయతీ, రెవెన్యూ శాఖలను ఏకం చేయాలి. మన రాష్ట్రంలో 1127 రెవెన్యూ మండలాలు, 1094 మండల పరిషత్‌లు, 21,943 గ్రామ పంచాయతీలు, 28,124 రెవెన్యూ గ్రామాలు, 26,614 నివాసిత గ్రామాలు, 1510 నివాసాలు లేని గ్రామాలు ఉన్నాయి.
గ్రామ పంచాయతీ |
ఆంధ్రప్రదేశ్‌లోని
గ్రామ పంచాయతీలు 1964లో రూపొందించిన చట్టాన్ని అనుసరించి పనిచేస్తున్నాయి.
చట్టరీత్యా కమీషనర్ అనే అధికారి (జిల్లా కలెక్టర్) ఒక రెవెన్యూ గ్రామం లేదా
దానిలోని ఏదైనా ఒక భాగాన్ని గ్రామ పంచాయతీగా సృష్టించవచ్చు.
|
500కు పైగా జనాభా
ఉన్న ప్రతి గ్రామానికి ఒక 'గ్రామ పంచాయతీ' ఉంటుంది. గ్రామ పంచాయతీలు
అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి గ్రామానికి ఒక 'గ్రామ సభ' కూడా అమల్లోకి
వచ్చింది. గ్రామంలోని ఓటర్లు అందరూ ఆ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు.
|
సర్పంచ్ |
![]() |
గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని 'గ్రామ సర్పంచ్' అంటారు. సర్పంచ్‌ను గ్రామంలోని 18 సంవత్సరాలు నిండిన వయోజనులు అందరూ రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. 21 సంవత్సరాలు నిండినవారు సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి అర్హులు. గ్రామ పంచాయతీ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు. |
సర్పంచ్ అధికారాలు |
» ఉపసర్పంచ్ ఎన్నిక కోసం ఏర్పాట్లు చేయడం. » గ్రామ పంచాయతీ రికార్డులను చూడటం. » ఎగ్జిక్యూటివ్ అధికారిని నియంత్రించడం. » గ్రామాభివృద్ధి అధికారి ద్వారా గ్రామ పంచాయతీకి కావాల్సిన సమాచారం సేకరించడం. » సభ్యుల అనర్హతలను జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తేవడం. » గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేయడం. » గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించడం. |
గ్రామసభ విధులు |
» సాలీనా పంచాయతీకి సంబంధించిన ఖాతాలు, ఆడిట్ నివేదికను గ్రామసభకు సమర్పిస్తుంది.
» గడిచిన ఏడాది పాలనా నివేదిక, కొత్త పనులకు సంబంధించిన ప్రతిపాదనతో పాటు కొన్ని ముఖ్య విషయాలను గ్రామసభ చర్చిస్తుంది.
» గ్రామసభ సమావేశాలను ఏర్పాటు చేయని సర్పంచ్ పదవి కోల్పోతాడు. కానీ వాస్తవానికి గ్రామసభ సమావేశాలను సక్రమంగా నిర్వహించడం లేదు. » కొన్ని గ్రామాల్లో అతి తక్కువమంది గ్రామస్థులతో మొక్కుబడిగా సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వానికి మాత్రం గ్రామసభ జరిగినట్లు నివేదిక సమర్పిస్తున్నారు. |
గ్రామ పంచాయతీ నిర్మాణం |
» గ్రామ పంచాయతీలో సభ్యులుగా ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకున్న సర్పంచ్‌తో పాటు, వివిధ వార్డు మెంబర్లు ఉంటారు. » ప్రజలు నేరుగా ఎన్నుకున్నప్పటికీ సర్పంచ్ పంచాయతీలో ఒక సభ్యుడిగా కొనసాగుతాడు. కాబట్టి అతడిని పంచాయతీ అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించలేదు. » సర్పంచ్ లేనప్పుడు పంచాయతీ సభ్యులు ఎన్నుకున్న ఉప సర్పంచ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. పంచాయతీ అతడిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు. » సర్పంచ్ గ్రామ సభ, పంచాయతీలను సమావేశపరిచి వాటికి అధ్యక్షత వహిస్తాడు. |
» కనీసం మూడు నెలలకు ఒకసారి సర్పంచ్ పంచాయతీని సమావేశపరచాలి, లేదంటే అతడు చట్టరీత్యా పదవిని కోల్పోతాడు. » ప్రతి గ్రామ పంచాయతీకి వ్యవసాయం, ప్రజారోగ్యం - పరిశుభ్రత, రవాణా సౌకర్యాలకు సంబంధించిన 3 కమిటీలు ఉంటాయి. ఇవి సంబంధిత సమస్యలపై చర్చించి, పంచాయతీకి సలహాలు ఇవ్వాలి. అయితే చాలా తక్కువ పంచాయతీలు మాత్రమే ఈ కమిటీల పద్ధతిని వినియోగించుకుంటున్నాయి. » 19,000కు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో గుర్తించిన 1000 పంచాయతీలకు మాత్రం ప్రభుత్వం కార్యనిర్వహణాధికారులను నియమించింది. మిగిలిన పంచాయతీల్లో ఆ అధికారాన్ని సర్పంచ్‌లకు కట్టబెట్టింది. కార్యనిర్వహణాధికారి ఉండే చోట మాత్రం సర్పంచ్ అతడిని పర్యవేక్షిస్తాడు. |
గ్రామ పంచాయతీ విధులు |
ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా గ్రామ పంచాయతీ కింది విధులను నిర్వహిస్తుంది. » గ్రామంలోని రోడ్లు, వంతెనలు, పంచాయతీ భవనాలు నిర్మించడం, పాతవాటిని బాగుచేయడం. |
» రోడ్లను శుభ్రపరచడం, చెత్తా చెదారం తొలగించడం. పాడుబడ్డ బావులు, కుంటలు, గుంతలను పూడ్చడం.
» ప్రజా మరుగుదొడ్లను ఏర్పాటు చేసి శుభ్రపరచడం, శ్మశానాలను నిర్వహించడం. దిక్కులేని శవాలను, పశువుల కళేబరాలను పాతిపెట్టడం.
» కలరా, మలేరియా లాంటి అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం.
» తాగునీరు సరఫరా చేయడం, జనన మరణాలను నమోదు చేయడం, పశుశాలలను ఏర్పాటు చేయడం.
పై పనులే కాకుండా గ్రామ పంచాయతీ కింది విధులను కూడా నిర్వహించవచ్చు.
» ధర్మశాలలు, విశ్రాంతి భవనాల నిర్మాణం, వాటి నిర్వహణ.
» రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో చెట్లను నాటి సంరక్షించడం.
» సాంఘిక, ఆరోగ్య, విద్యా వసతులను కల్పించడం.
» కుటీర పరిశ్రమలు, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం.
గ్రామ పంచాయతీ అధికారాలు
» కార్యనిర్వాహకుడు లేదా సర్పంచ్ రూపొందించిన బడ్జెట్‌ను గ్రామ పంచాయతీ ఆమోదించిన తర్వాత, దాన్ని డివిజినల్ పంచాయతీ అధికారికి సమర్పిస్తుంది.
డివిజినల్ పంచాయతీ అధికారి దానికి సవరణలు లేదా సూచనలు చేస్తూ ఒక నెలలోగా గ్రామ పంచాయతీకి పంపించాలి. ఆ సూచనలను పాటిస్తూ తిరిగి బడ్జెట్‌ను ఆమోదించే అధికారం మాత్రం పంచాయతీకే ఉంటుంది.
No comments:
Post a Comment