Saturday 4 January 2014

10 తరగతి తర్వాత స్కాలర్ షిప్పులు
లక్ష్యం
ఇంటర్మీడియట్ మరియు ఇతర పై చదువులు చదివే ఎస్.సి. విద్యార్థులకు విద్య సదుపాయాన్ని స్కాలర్ షిప్ ల ద్యారా కలుగ చేయడం.
అర్హత
వార్షిక ఆదాయం రూ. 12,000 /-లు మించని ఎస్.సి. కుటుంబాల కు చెందిన విద్యార్థులు
లబ్ధిదారులు
పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని, వార్షికాదాయం రూ. 12,000 /-లకు మించని ఎస్.సి కుటుంబాలకు చెందిన విద్యార్థులు
ఉపయోగాలు
రూ. 10,000/- ల నగదు ప్రోత్సాహకం మరియు రూ. 15,000 ల ఋణ సదుపాయం.
సంప్రదించండి
ఎమ్మార్వో/ సహాయ సాంఘిక సంక్షేమ అధికారి / ఆర్.డి.ఓ. /జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి / సాంఘిక సంక్షేమ అధికారి /సాంఘిక సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి/ జిల్లా కలెక్టర్


అనాధ కేంద్రాలు
లక్ష్యం
అనాథ పిల్లల విద్యాభివృద్ధి కోసం హాస్టల్ వసతి కల్పించడం.
అర్హత
8-15 సంవత్సరాల లోపు వయస్సు అనాథ బాలలు 3 నుండి 10 వతరగతి లోపు వారు అర్హులు
లబ్ధిదారులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ మరియు పట్టణ ప్రాంత 8-15 సం,,లలోపు, 3-10వ తరగతి చదివే అనాథ బాలలు అందరు.
ఉపయోగాలు
ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, నోటు పుస్తకాలు, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు వీటితో పాటు బాలురకు రూ.20/- లు మరియు బాలికలకు రూ.25 /- లు ప్రతి నెల సబ్బులు మరియు కొబ్బరి నూనె నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది.
సంప్రదించండి
ప్రధానోపాధ్యాయులు /హాస్టల్ సంక్షేమ అధికారి / జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి /సహాయ సంచాలకులు , సాంఘిక సంక్షేమం.
జి.ఓ.నెం 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ఆర్.సి.నెం. 126 ఎస్.డబ్ల్యు (ఇడియు.2) డిపార్ట్ మెంట్ , తేది 03 /09 / 1997
ఎస్.టి సంక్షేమ హాస్టల్స్
లక్ష్యం
ఎస్.టి.తెగల విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించడం ద్వారా విద్యా ప్రామాణాలను పెంచడం.
అర్హత
వార్షిక ఆదాయం 12,000/- లకు మించని 3 నుంచి 10 వతరగతి మధ్య ఉన్న ఎస్.టి.విద్యార్ధులు
లబ్ధిదారులు
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు చెందిన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 3 నుంచి 10 వతరగతి మధ్య ఉన్న విద్యార్ధులు
ఉపయోగాలు
ఉచితంగా పాఠ్య ఫుస్తకాలు, నోట్స్, భోజనం, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు వీటితో పాటు బాలురకు రూ.20/- లు మరియు బాలికలకు రూ, 25/-లు వరకు ప్రతి నెల సబ్బులు మరియు కొబ్బరి నూనె నిమిత్తం.
సంప్రదించండి
ప్రధానోపాధ్యాయులు / హాస్టల్ సంక్షేమ అధికారి/ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి/ సహాయ సంచాలకులు, సాంఘిక సంక్షేమం.
జి.ఓ.నెం
జీ.ఓ.ఎం.ఎస్.నెం. 126, ఎస్.డబ్య్లు (జి2) డిపార్ట్ మెంట్, తేది 03-09-1997
 
కిశోర బాలికల పథకం
లక్ష్యం
బాలికలను నూటికి నూరు శాతం ప్రాథమిక విద్యలో చేర్పించడం, బాల్య వివాహాలను నిరోధించడం.
అర్హత
15 సం,,లలోపు బాలికలు
లబ్ధిదారులు
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 15 సం,,లలోపు బాలికలు
ఉపయోగాలు
వివిధ నైపుణ్యాలలో శిక్షణనివ్వడం, ఇతర ప్రదేశాలను సందర్శింపజేయడం, వర్క్ షాపులు మరియు బ్రిడ్జి కోర్సులలో శిక్షణనివ్వడం.
సంప్రదించండి
అంగన్ వాడీ టీచర్ / ఐసిడియస్ సూపర్ వైజర్ / ఐసిడియస్ /పి.డి. /మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి

జీవో.యమ్.యస్.నెం. 70, యస్.డబ్య్లు (ఆర్.యస్) డిపార్ట్ మెంట్, తేది 10-7-1999
 

No comments:

Post a Comment