Saturday, 4 January 2014

గ్రామీణ అత్యవసర ఆరోగ్య ప్రమాణ పథకం
లక్ష్యం
ప్రసవ సమయానికి దగ్గరలో వున్న గర్భిణీలు మరియు అత్యవసర పరిస్థితులలో ఉన్న శిశువులు, పిల్లలకు, తక్షణ, ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం
అర్హత
ప్రసవించబోయే గర్భిణీలు మరియు అత్యవసర పరీక్షల నిమిత్తం పంపవలసిన శిశువులు మరియు పిల్లలు
లబ్ధిదారులు
ప్రసవించబోయే గర్భిణీలు మరియు అత్యవసర పరీక్షల నిమిత్తం పంపవలసిన శిశువులు మరియు పిల్లలు
ఉపయోగాలు
కిలోమీటరుకు రూ.5 /-ల వంతున రోజు మొత్తం ఎప్పుడైనా అంబులెన్స్ సౌకర్యం కల్పించడం. యస్ సి మరియు యస్ టిలకు ఉచిత ప్రయాణ సౌకర్యం.
సంప్రదించండి
ఏ.యన్.యమ్. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు. జిల్లా ఔషధ మరియు ఆరోగ్య అధికారి.

జీవో. ఆర్.టి.నెం. 205 /యమ్.హెచ్ అండ్ యఫ్, డబ్ల్యు (డి1) డిపార్ట్ మెంట్, తేది 3.1.2004

బాలల హక్కుల పరిరక్షణకై గ్రామ పంచాయితీల బాధ్యతల

ప్రస్తుతం మనదేశంలో చాలా మంది బాలలు హక్కులు కోల్పోయి దీనావస్ధలో ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా చాలా మంది బాలబాలికలు అన్ని జిల్లాల్లో బాల కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ బాలలు పొలం పనులు, కూలి పనులు, నేత పనులు, ఇంటి పనులు, హాటల్, గ్యారేజీల్లో, గేదేలు, మేకల వద్ద పనులు చేస్తూ నిరంతరం వారి హక్కులను కోల్పోయి జీవిస్తున్నారు.
ఇంట్లో పనివాళ్ళగా లేదా దాబాలు, రెస్టారెంట్లు, హాటళ్ళు, టీ దుకాణాలు లేదా ఇతర వినోద కేంద్రాల్లో 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకొనుట 10 అక్టోబరు 2006 నుండి నిషేధించబడింది. పిల్లలను ఈ వృత్తుల్లో ఎవరైనా పెట్టుకుంటే ఒక సంవత్సరం కారాగారా శిక్షకు మరియు (లేదా) జరిమానాకు బాధ్యులగుదురు.
పలుచోట్ల బాలల పైన దౌర్జన్యాలు, లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయి. బాలలు వారి హక్కులను కోల్పోయి వీధుల్లో తిరుగుతున్నారు. గ్రామ పంచాయితీలు బాధ్యత వహించి బాలలందరు బడిలో ఉండేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ బాలల భవిష్యత్తుకు రూపకల్పన చేసి వారి జీవితాలను మెరుగు పరిచేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నించాలి.
  • బాలల హక్కుల సంరక్షణ కోసం గ్రామ పంచాయితీ స్ధాయిలో ఎంపిక చేయబడిన కూలీల ప్రతినిధులు (లేబర్ యూనియన్స్) కార్మిక సంఘాలు, మహిళ మండలి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, గ్రామ పంచాయితీ ప్రతినిధులు అంగన్ వాడీ కార్యకర్తలు, సమాజ సేవకులు మరియు బాలల హక్కుల కోసం పాటుపడే యువతకు శిక్షణ ఇచ్చి వారి ద్వారా బాలల హక్కుల సంరక్షణకు పాటు పడటం.
  • బాలల హక్కుల పరిరక్షణ సంస్ధలు గ్రామంలోని పాఠశాలలోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించటంలో మార్గాన్ని ఆలోచింపజేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలను పరిష్కరించుకొనుట.
  • ప్రతి గ్రామ పంచాయితీలో బాలల హక్కుల సంఘాలు ఏర్పాటు చేసుకొనుటకు బాలలకు, యువతకు శిక్షణ ఇచ్చి బాలల సంఘాలను బలోపేతం చేయటం.
  • గ్రామ పంచాయితీ స్ధాయిలో ఉన్న బాలల పక్కుల సంఘాల కార్యక్రమాలు చేపట్టడం మరియు పర్యవేక్షణ నిరంతరం కొనసాగేలా ఆ సంఘ ప్రతినిధులకు శిక్షణలు ఇవ్వడం.
  • బాలల సంఘాలకు, బాలల హక్కులు గురించి ప్రచారం నిర్వహిస్తూ బాలలందరిని స్కూల్ కి వచ్చే విధంగా, బాలల సమస్యలను వారే చర్చించుకుని, వారి అభిప్రాయాలను వ్యక్తపరచుకొనుటకు వేదికలు ఏర్పాటుచేయడం

చట్ట ప్రకారంగా ఈ క్రింద సూచించిన హక్కును వారికి చెందేలా చూడాలి
  • ప్రేమ, నమ్మకం
  • వాత్సల్యము, స్నేహం
  • రక్షణ
  • బాల్యం
  • శిక్షణ
  • పోషణ, వసతి
  • ఆరోగ్యం, పౌష్టికాహారం
  • ఆటపాటలు, మంచితనం
  • భాగస్వామ్యం పొందుట
  • అభిప్రాయాలకు అవకాశం
  • వినోదం, సంతోషం

బాలల హక్కుల సంరక్షణలో గ్రామ పంచాయితీల పాత్ర
  • బాలల చదువు కోసం గ్రామ పంచాయితీలు కృషి చేయాలి.
  • గ్రామ పంచాయితీ గ్రామంలోని అంగన్ వాడి స్కూల్ వివరాలు సేకరించి ఉంచుకోవాలి
  • స్కూల్ బిల్డింగ్, అంగన్ వాడి బిల్డింగ్ సమస్యను గుర్తించి దానిని పూర్తి చేయుటకు ప్రయత్నించాలి.
  • అంగన్ వాడి స్కూల్ కు సంబంధించిన పనులను ఆయా అధికారులతో చర్చించి ఆ పనులను పూర్తి చేయాలి.
  • బాలల హాజరు, టీచర్స్, వాళ్ళ వర్క్ ప్రాబ్లమ్ గురించి అంగన్ వాడి స్కూల్ అభివృద్ధి కమిటీ వాకబు చేస్తుండాలి.
  • గ్రామ పంచాయితీల ద్వారా గ్రామంలోని అంగన్ వాడి పాఠశాలలతో సంబంధాలను పెంపొందించుకోవాలి.
  • బాల కార్మికవ్యవస్ధ లేని పంచాయితీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాలి

జవహర్ బాల ఆరోగ్య రక్ష

జవహర్ బాల ఆరోగ్య రక్ష అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నవంబరు 14, 2010 నాడు ప్రభుత్వం పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలను ప్రారంభించాలని ఇందుమూలంగా ఆదేశాలను జారీ చేసింది. కార్యనిర్వహణలో జవహర్ బాల ఆరోగ్య రక్ష (జె.బి.ఏ.ఆర్) అన్న పేరు పిల్లల ఆరోగ్యాభివృధ్ది పధకం (చైల్డ్ హెల్త్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రామ్ - చిప్) గా వ్యవహరంచబడుతుంది.
ఈ పధకం యొక్క ఆశయాలుః
a) పాఠశాలలలో చదివే పిల్లలందరికి ఆరోగ్య పరిక్షలు, దీనితో పాటుగా పిల్లల ఆరోగ్య రికార్డు (ఎస్.హెచ్.ఆర్) ను కూడా జారీ చేయడం.
b) 5 – 7 సంవత్సరాల వయస్సు కల పిల్లలందరికి డి.పి.టి. బూస్టర్ టీకాలను వేయడం. అలాగే, 10 – 15 సంవత్సరాల వయస్సు కల పిల్లలకు టి.టి. బూస్టర్ ను ఇవ్వడం.
c) కడుపులో పాములు పెరగకుండా నివారించే మందును, అలాగే విటమిన్ ఏ మరియు డి ను సంవత్సరానికి రెండుసార్లు పిల్లలందరికి ఇవ్వడం మరియు రక్తపులేమితో బాధపడుతూ వుండే పిల్లలకు ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ బిళ్లలను ఇవ్వడం.
d) చిన్న చిన్న వ్యాధులన్నింటికి - అంటే పోషకాహారలోపం, స్కేబీస్ వంటి చర్మవ్యాధులు మరియు తలలో పేలు రావడం వంటి వాటికి చికిత్స చేయడం.
e) మాధ్యమిక మరియు తృతీయ ఆరోగ్య పరిరక్షణ కావలిసిన పిల్లలను సరైన సౌకర్యాలున్నచోట ప్రత్యేక సమీక్ష, సరైన దర్యాప్తులు, వ్యాధులకు చికిత్సకై పంపడం మరియు ఈ చికిత్సావిధానాన్ని అనుసరిస్తూ, పాటిస్తూ ఉండడం.
f) వ్యాధుల నివారణలోను మరియు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడాన్ని ఆరోగ్య విద్యను, జీవితనైపుణ్యాలను మరియు ఆచరణీయమైన పాఠాలను సమైక్యం చేయడం.
g) ఉపాధ్యాయులకు మరియు పాఠశాలలో పనిచేసే ఇతరులకు ఆరోగ్య చెక్ అప్ మరియు ఆరోగ్య మెరుగుదలతో పోషకాహార విద్యను సమైక్యం చేయడం.
ఈ జవహర్ బాల ఆరోగ్య రక్ష రాష్ట్రంలో 46,823 ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో చదువుతూ వుండే 85,32,635 మంది విద్యార్ధులకు వర్తిస్తుంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి ముందే విద్యార్ధులందరికి పరీక్షలు చేయడం, అలాగే ఇప్పటికే వ్యాధులతో ఉన్నవారిని కూడా తగిన పైద్య చికిత్సకు పంపడం (రిఫరల్) పూర్తవుతుంది. దీని వెంటనే మండల మరియు జిల్లా స్ధాయిలలో పూర్తి చేయబడే ఒక వివరణాత్మకమైన షెడ్యూలును తయారుచేయడం జరుగుతుంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి) వైద్య అధికారి నేతృత్వంలో ఒక పేరా మెడికల్ బృందం, ఒక నేత్ర సంబంధిత అధికారితో సహా, ఒక ఆరోగ్య బృందం ప్రతి పాఠశాలతో పాటుగా, పాఠశాలలోచదివే పిల్లలు అందరిని పరిక్ష చేయడానికి ముందుగా నియమించిన షెడ్యూల్ ను అనుసరిస్తూ 1 డిసెంబరు 2010 మరియు 10 మార్చి 2011 మధ్య కాలంలో సందర్శిస్తుంది.
వైద్యునిచే శారీరక పరీక్షలు వివరంగా నిర్వహింపబడిన తరువాత ప్రతి ఒక్కరికి విద్యార్ధుల ఆరోగ్య రికార్డు (స్టూడెంట్ హెల్త్ రికార్డ్ – ఎస్.హెచ్.ఆర్) ఇవ్వబడుతుంది. 5 సంవత్సరాల వరకూ చెల్లుబాటు అయ్యే ఈ ఎస్.హెచ్.ఆర్. ఒక పరిపూర్ణమైన డాక్యుమెంట్ లాంటిది. విద్యార్ధుల జీవితంలో చోటు చేసుకునే ఆరోగ్య పరిణామాలు ఇందులో పొందుపరుస్తూ, ఈ ఎస్.హెచ్.ఆర్. పాఠశాల ఉపాధ్యాయుని వద్ద జాగ్రత్తగా ఉంచబడి ఎపుడైనా విద్యార్ధికి గాని, అతని తలిదండ్రులకు గాని వారి పిల్లలను ఆసుపత్రికి పంపవలసి వచ్చినప్పుడు వారికి ఇవ్వబడుతుంది. తదుపరి వ్యాధి నిర్ధారణకు మరియు చికిత్సకు అన్నీ ఏ.పి.వి.వి.పి. మరియు విద్యాబోధన చేయు ఆసుపత్రులలోను ఈ ఎస్.హెచ్.ఆర్. ను తనతో తీసుకు వెళ్లే ప్రతి విద్యార్ధికి కూడా వ్యాధి దర్యాప్తునందు మరియు చికిత్సలోనూ ప్రాధాన్యత నివ్వబడుతుంది. ఈ పాఠశాల విద్యార్ధులకోసం ఒక కౌంటర్ ను విడిగా నెలకొల్పి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వీరికోసం ఒక రిజిస్టరును కూడా విడిగా ఉంచడం జరుగుతుంది. విటమిన్ ఏ మరియు డి లను ఇవ్వడం మరియు పిల్లల కడుపులో పాములు రాకుండా నివారించడంతో పాటుగా చిన్న చిన్న వ్యాధులు ఏమైనా వుంటే వాటిపై పరిక్షలు నిర్వహించే వైద్యునిచేతనే చికిత్సలను చేయించడం కూడా జరుగుతుంది.
అందరికీ విద్య
పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం – అభివృద్ధి చెందుతుంది. తమ పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో భాగస్వాములైతే ప్రాధమిక విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే గాక విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 – 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మనందరిపైన ఉంది. అలాగే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఆర్టికల్ 21 ఎ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించడమైనది. ఆర్టికల్ 51 ఎ ప్రకారం దేశంలోని ప్రతి తల్లి / తండ్రి లేదా సంరక్షకుడు తమ పిల్లలకు 6 నుండి 14 సంవత్సరాల వయస్సులోని వారందరికీ విద్యావకాశాలు కల్పించటం ప్రాథమిక విధిగా పేర్కొనబడినది. దీనిలో భాగంగానే 6 – 14 సంవత్సరాల వయస్సులోని బాలలందరికీ విద్యను అందించడానికి ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం, 2009 ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ చట్టం ఏప్రియల్ ఒకటి 2010 నుండి భారతదేశమంతటా (జమ్ముకాశ్మీర్ మినహా) అమలులోకి వచ్చింది.
విద్యాహక్కు చట్టం అమలు ద్వారా పిల్లలందరికీ విద్యావకాశాలు కల్పించుటకు మరియు సార్వత్రిక ఎలిమెంటరీ విద్యా సాధన కోసం భారత ప్రభుత్వం సర్వ శిక్షా అభియాన్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తొంది. ఈ కార్యక్రమాల అమలుకు సహకరించి ఎలిమెంటరీ విద్యాసాధనకు మనవంతు కృషి చేద్దాం.
73వ రాజ్యాంగ సవరణ
73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పాఠశాల విద్యాశాఖ నియంత్రణలో ఉన్న అన్ని పాఠశాలలకు చెందిన అంశములకు సంబంధించిన అధికారాలు, బాధ్యతలను పంచాయితీరాజ్ సంస్థలకు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 2 తేది 03.02.2008 ద్వారా బదలాయింపు చేయడం జరిగింది.
పంచాయితీరాజ్ సంస్థలను పునరుజ్జీవం మరియు బలోపేతం చేయడానికై ఈ చట్టం నిర్దేశింపబడినది. ఈ సవరణ పంచాయితీరాజ్ సంస్థలకు అధికారాలను, బాధ్యతలను బదలాయించే అవకాశం కల్పించింది. మరియు పంచాయితీలు సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధి కొరకు, ప్రణాళికల రచన కొరకు ఉద్దేశించిన పథకాల అమలులో స్వయం పరిపాలన సంస్థలుగా పనిచేయగలుగుతాయి.
  • రాజ్యాంగ అమలులోని స్పూర్తిని ప్రతిబింబించే విధంగా ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ చట్టం 1994 చేయబడింది.
  • భారత ప్రభుత్వం పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ, పంచాయితీరాజ్ సంస్థలకు అధికారాలను బదిలీ చేసే సవివరమైన ప్రణాళిక చేయుటకు 7వ రౌండు టేబుల్ సమావేశం చేసింది.
ఈ చట్ట సవరణ ఆధారంగా ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలో పంచాయితీ విద్యా ఉపకమిటీని ఏర్పాటు చేయాలి.
పంచాయితీ విద్యా ఉపకమిటీ ఏర్పాటు
ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలోని పంచాయితీ విద్యా ఉపకమిటీని గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మహిళ వార్డు సభ్యులతో ఒకరు వైస్ చైర్మెన్ గాను, మరొకరు సభ్యులుగాను మరియు షెడ్యుల్డ్ కులాలు / తెగలు లేదా వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఇద్దరు వార్డు సభ్యులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

ఉపకమిటీ విధులు :
  • గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని పాఠశాలల పనితీరు
  • పాఠశాల సిబ్బంది రోజు వారి హాజరు
  • పిల్లల విద్యా ప్రమాణాలు
  • పాఠశాల మౌళిక సదుపాయాలు
  • మధ్యాహ్న భోజనం పథకం సక్రమ అమలు మొదలగు వాటిని పర్యవేక్షించే అధికారం కలిగి ఉంటుంది.

సమావేశాల నిర్వహణ
ఉపకమిటీ ప్రతి శనివారం, ఒకవేళ శనివారం సెలవుదినమైతే ఆ ముందు రోజు సమావేశం నిర్వహిస్తుంది. సమావేశానికి గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొంటారు.

చర్చించే అంశాలు :

ఉచిత, నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం – 2009
6 నుండి 14 సం|| ల గల పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించడానికి పార్లమెంట్ చేసిన విద్యాహక్కు చట్టం 2009 ఆగష్టు 26న రాష్ట్రపతి ఆమోదం పొంది, ఏప్రియల్ ఒకటి 2010 నుండి భారత దేశమంతటా అమలులోనికి వచ్చింది. దీనినే Right to Education Act అని కూడా అంటారు.
RTE – 2009 చట్టంలోని ముఖ్యాంశాలు :

రాజీవ్ విద్యా మిషన్ (ఎస్. ఎస్.ఎ) - లక్ష్యాలు
పిల్లలందరికీ విద్యనందించడం మనందరి సామాజిక బాధ్యత. సమాజంలోని ప్రతి ఒక్కరూ చదువుకుంటేనే దేశం – అభివృద్ధి చెందుతుంది. తమ పిల్లలు బాగా చదువుకుని ఎదగాలని, ప్రయోజకులు కావాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. అలాంటి తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాఠశాల విద్యాభివృద్ధిలో భాగస్వాములైతే ప్రాధమిక స్థాయి విద్య అన్ని విధాలుగా అభివృద్ధి చెందడమే గాక విద్యా ప్రమాణాలు మెరుగవుతాయి.
  1. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 45 ప్రకారం 6 – 14 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మనందరిపైన ఉంది.
  2. ఆర్టికల్ 51 ఎ ప్రకారం దేశంలోని ప్రతి తల్లి / తండ్రి లేదా సంరక్షకుడు తమ పిల్లలకు 6 నుండి 14 సంవత్సరాల వయస్సులోని వారందరికీ విద్యావకాశాలు కల్పించటం ప్రాథమిక విధి.
  3. అలాగే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం ఆర్టికల్ 21 ఎ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణించాలని నిర్దేశించినది.
  4. దీనిలో భాగంగా ఉచిత, నిర్బంధ ఎలిమెంటరీ విద్యకొరకు కేంద్రప్రభుత్వం విద్యహక్కు బిల్లును 29 ఆగష్టు 2009 న ఆమోదించింది. దీనికి అనుగుణంగా విద్యహక్కుచట్టం 2009 ఏప్రియల్ ఒకటి 2010 నుండి జమ్ము- కాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది.
లక్ష్యాలు :
  • సార్వత్రిక విద్యా సాధనకు మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా మిషన్ పేరిట సర్వశిక్ష అభియాన్ ద్వారా కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి.
  • బడిఈడు గల బాలలందరూ 2010 – 11 విద్యా సంవత్సరంలోగా ఎలిమెంటరీ విద్య ( 8వ తరగతి వరకు) ను పూర్తి చేసేలా కృషి చేయడం.
  • ఇందుకోసం నాణ్యతతో కూడిన ప్రయోజనకరమైన ఎలిమెంటరీ విద్య పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం.
  • 2010 – 11 సంవత్సరంలోగా ఎలిమెంటరీ విద్య స్ధాయిలో, బాలురు, బాలికలు మధ్య వివక్షతను సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసాలను తొలగించడం.
  • 2010 – 11 విద్య సంవత్సరంలోగా సార్వత్రిక నిలుపుదలను సాధించడం.

రాజీవ్ విద్యా మిషన్ (ఎస్. ఎస్.ఎ) లో అమలుతున్న కార్యక్రమాలు

పాఠశాలలు అందుబాటు

బడిఈడు పిల్లల నమోదు మరియు నిలకడ

గుణాత్మక విద్య సాధించాలంటే.....?
పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న బాల బాలికందరికి అన్ని విషయాలలో ఆశించిన సామర్థ్యాలు సాధించడం ద్వారా గుణాత్మక విద్యను అందించటం సర్వ శిక్షా అభియాన్ లక్ష్యం.
ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం బాలల సర్వతోముఖాభివృద్ధి జరగాలంటే సాధ్యమైనంత వరకు బోధనామాధ్యమం బాలల మాతృభాషగా ఉండాలి.
  • బాలల పూర్తి సామర్థ్యం మేరకు శారీరక, మానసిక శక్తులను పెంపొందే బోధన జరగాలి.
  • పిల్లలను కేంద్రంగా చేసుకుని వారికి అనువైన బోధనా పద్ధతుల్లో కార్యక్రమాలు, పరిశోధనలు, కనుగొనటం ద్వారా నేర్చుకొవాలి.
  • భయాలు, ఆందోళనల వంటి వాటి నుంచి బాలలను విముక్తి చేసి వారు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించటంలో సహాయపడాలి.
  • జ్ఞానాన్ని బాలలు అర్ధం చేసుకున్న విధానం, దానిని అన్వయించే సామర్థ్యాలపై నిరంతర సమగ్రమూల్యాంకన జరగాలి.
  • ప్రస్తుత పాఠశాలల్లో అమలవుతున్న అభ్యసనాభివృద్ధి కార్యక్రమం (ఎల్.ఇ.పి) ద్వారా విద్యార్ధి, తరగతి మరియు పాఠశాల వారీగా గ్రేడింగ్ నిర్ణయించి విద్యార్ధుల అభివృద్ధికై కృషి జరగాలి. పాఠశాలలో 1,2, 3 తరగతి పిల్లల కొరకు స్నేహ బాల కార్డులు ద్వారా బోధన జరగాలి. విద్యాబోధనలో నిరంతరం కొత్తదనాన్ని చూపిస్తూ..... పిల్లల జ్ఞాన సమపార్జనే లక్ష్యంగా ముందు కెళితే గుణాత్మకతను సాధించవచ్చును.

పాఠశాలలకు అందజేసే వివిధ గ్రాంట్లు – నిధుల వినియోగం – మార్గదర్శకాలు

బాలికల విద్య

బడి బయటి పిల్లలకు విద్యావకాశాలు
విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుండి 14సం11 లోపు వయసు గల పిల్లలందరికీ విద్యనందించడం రాజీవ్ విద్యామిషన్ ప్రధాన లక్ష్యం. ఈ వయసులోని బడిబయట పిల్లలకు విద్యావకాశాలు కల్పించేందుకు రాజీవ్ విద్యామిషన్ వివిధ రకాల వ్యూహాలను చేస్తోంది.
బడిబయట పిల్లల్లో ప్రధానంగా అసలు బడికి పోనివారు, మధ్యలో బడిమానిన వారు ఉంటారు. వారి వయసు తగిన తరగతుల్లో చేర్పించి ప్రత్యేక శిక్షణా కేంద్రాల (ఎస్.టి.సి) ద్వారా పిల్లలకు విద్యవకాశం కల్పించడం జరుగుతుంది.
విద్యాహక్కు చట్టం ప్రకారం బడిబయట పిల్లలకు కల్పించబడిన సౌకర్యాలు నాన్ రెసిడెన్షియల్ ప్రత్యేక శిక్షణా కేంద్రాలు

రెసిడెన్షియల్ ప్రత్యేక శిక్షణా కేంద్రాలు

ప్రత్యేక శిక్షణా కేంద్రాలు

మదర్సాలు

పట్టణ ప్రాంత అణుగారిన పిల్లలకు విద్యావకాశాలు

పాఠశాల భవన నిర్మాణాలు

ప్రత్యేకావసరాలు గల పిల్లలకు విద్యావకాశాలు

పాఠశాల అభివృద్ధి మరియు గుణాత్మక విద్యాసాధనలో ప్రజల భాగస్వామ్యం

పాఠశాల సమగ్రాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం సందేహాలు – సమాధానాలు
1. ఇతర అభివృద్ధికి కార్యక్రమాలతో తీరికలేకుండా ఉంది. పాఠశాల అభివృద్ధికి సమయం ఎక్కడిది?

2. పాఠశాల అభివృద్ధికి ఏమైనా చేద్దామనుకుంటే రాజకీయాలు అడ్డం వస్తున్నాయి?

3. పాఠశాల పనితీరును పర్యవేక్షించుటకు అధికారులు ఉన్నప్పుడు మా పాత్ర ఎంత వరకు ?

4. ఉపాధ్యాయులు సెలవు పెట్టినప్పుడు మాకు సమాచారం చెప్పాలా ? వద్దా?

5. ఉపాధ్యాయుల వేతనాల చెల్లింపులో మా భాగస్వామ్యం లేకుండా వారి హాజరును ఎలా మెరుగుపరచగలం?

6. ఉపాధ్యాయుల హాజరు పుస్తకంలో సంతకం చేసే అధికారం మాకు ఉందా ? లేదా?

7. ఉపాధ్యాయుల బోధించేటప్పుడు తరగతి గదిలోకి వెళ్ళి పర్యవేక్షించే అధికారం మాకు ఉందా? లేదా?

8. పిల్లల ప్రగతిని మేము ఎప్పుడు, ఎలా సమీక్షించాలి?

9. రాజీవ్ విద్యామిషన్ ద్వారా విడుదలైన నిధులను ఎలా ఖర్చు చేయాలి ?
  • రాజీవ్ విద్యామిషన్ ద్వారా విడుదలైన నిధులను జమచేయుటకు ప్రత్యేకంగా పాఠశాల విద్యాయాజమాన్య కమిటీ చైర్మన్ (సర్పంచ్), మెంబర్ కన్వీనర్ అయిన ప్రధానోపాధ్యాయులతో బ్యాంకులో ఖాతా తెరచి జమ చేయాలి. పాఠశాల యాజమాన్య కమిటీ తీర్మానం మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖర్చు చేసి దానికి సంబంధించిన బిల్లులు మరియు వోచర్ లు సమకూర్చుకోవడం జరుగుతుంది.

10. రాజీవ్ విద్యామిషన్ ద్వారా విడుదలైన నిధుల జమా ఖర్చులు వివరాలు ఎవరు పర్యవేక్షిస్తారు?
  • పాఠశాల స్థాయిలో నిధుల జమా ఖర్చులను మండల విద్యాశాఖ అధికారి పర్యవేక్షిస్తారు. ఖర్చు వివరములు రిజిష్టరును పాఠశాల యాజమాన్య కమిటీ కూడా పర్యవేక్షించవచ్చును.

11. పాఠశాలకు విడుదలైన నిధుల వినియోగానికి సంబంధించిన ప్రాధాన్యతలను ఎవరు నిర్థారిస్తారు ?

12. పాఠశాల అవసర నిమిత్తం కొనుగోలు చేసిన వస్తువులు ఎవరీ ఆధీనంలో ఉండాలి?

13. పాఠశాలల్లో విద్యావాలంటీర్లను ఎవరు నియమించాలి ?
  • ప్రభుత్వ ఉత్తర్వు నెం. 83 ఆధారంగా ప్రాజెక్టు డైరెక్టర్ మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి సూచనల మేరకు జిల్లా కలెక్టర్ మరియు చైర్మెన్ ఆదేశాల ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీ రాజీవ్ విద్యామిషన్ (సర్వ శిక్షా అభియాన్) వారి అనుమతి మేరకు విద్యావాలంటీర్లను నియమిస్తుంది.

14. పాఠశాలకు ఎవరు సెలవులు మంజూరు చేస్తారు?

15. ప్రసూతి సెలవు, దీర్ఘకాలిక ఆరోగ్య మరియు ఇతర అవసరాల నిమిత్తం ఉపాధ్యాయులు సెలవులు పెడితే విద్యాబోధన కుంటు పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

16. సమాచార హక్కు చట్టం పరిధిలో ప్రజలు ఎలాంటి సమాచారాన్ని పాఠశాలల నుండి పొందవచ్చును.
  • పాఠశాలలో విద్యార్థుల హాజరు, నమోదు వివరాలు, విద్యార్థుల ప్రగతి, భవన నిర్మాణాలు, నిధుల మంజూరు, వాటి వినియోగం, పనిచేస్తున్న ఉపాధ్యాయులు, తరగతి వారీగా, విషయవారీగా విద్యార్థుల ప్రగతి, గ్రేడింగ్ పాఠశాల విద్యానిధి వినియోగము, మధ్యాహ్న భజన పథకమునకు సంబంధించిన వువరములు, పాఠశాలకు అందిన గ్రాంట్ల వివరాలతో పాటు పాఠశాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రధానోపాధ్యాయులకు దరఖాస్తు చేసి సమాచార హక్కు చట్టం ద్వారా పొందవచ్చు.

17. విద్యా హక్కు చట్టం ఎవరికోసం ప్రవేశ పెట్టబడింది?
  • 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ 8 సంవత్సరాల ఎలిమెంటరీ విద్య పొందే హక్కును కల్పిస్తూ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.
  • బడిఈడు గల పిల్లందరికీ 1 కి.మీ పరిధిలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ పరిధిలో ఎలిమెంటరీ స్థాయి పాఠశాలను (1 నుండి 8 తరగతులు) అందుబాటులోకి తీసుకురావటం కోసం విద్యాహక్కు చట్టం ప్రవేశ పెట్టబడింది.

18. నివాస ప్రాంతంలో ఒక్కరిద్దరే పిల్లలుంటే వారి కోసం పాఠశాల ఏర్పాటు చేయబడుతుందా?

19. విద్యాహక్కు చట్టం ద్వారా పిల్లలకు ప్రత్యేక సదుపాయములు కల్పిస్తున్నారా?
  • 1 నుండి 8 వతరగతి చదువుతూ దారిద్ర్యరేఖకు దిగువనున్న పిల్లలకు సంవత్సరమునకు రెండు జతల ఉచిత యూనిఫాం అందజేయబడుతుంది.
  • పాఠశాలకు కావాలసిన మౌళిక వసతులు, తగినంత మంది ఉపాధ్యాయులు, తరగతి గదులు, విద్యుత్ సౌకర్యం, నీటి సౌకర్యం, మరుగుదొడ్లు మొదలగునవి కల్పిస్తుంది.

20. పాఠశాల లేని ఆవాస ప్రాంతంలో నూతనముగా పాఠశాల ఏర్పాటు చేయాలంటే ఎంత మంది పిల్లలుండాలి?
 
10 తరగతి తర్వాత స్కాలర్ షిప్పులు
లక్ష్యం
ఇంటర్మీడియట్ మరియు ఇతర పై చదువులు చదివే ఎస్.సి. విద్యార్థులకు విద్య సదుపాయాన్ని స్కాలర్ షిప్ ల ద్యారా కలుగ చేయడం.
అర్హత
వార్షిక ఆదాయం రూ. 12,000 /-లు మించని ఎస్.సి. కుటుంబాల కు చెందిన విద్యార్థులు
లబ్ధిదారులు
పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని, వార్షికాదాయం రూ. 12,000 /-లకు మించని ఎస్.సి కుటుంబాలకు చెందిన విద్యార్థులు
ఉపయోగాలు
రూ. 10,000/- ల నగదు ప్రోత్సాహకం మరియు రూ. 15,000 ల ఋణ సదుపాయం.
సంప్రదించండి
ఎమ్మార్వో/ సహాయ సాంఘిక సంక్షేమ అధికారి / ఆర్.డి.ఓ. /జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి / సాంఘిక సంక్షేమ అధికారి /సాంఘిక సంక్షేమ శాఖ సహాయ కార్యదర్శి/ జిల్లా కలెక్టర్

అనాధ కేంద్రాలు
లక్ష్యం
అనాథ పిల్లల విద్యాభివృద్ధి కోసం హాస్టల్ వసతి కల్పించడం.
అర్హత
8-15 సంవత్సరాల లోపు వయస్సు అనాథ బాలలు 3 నుండి 10 వతరగతి లోపు వారు అర్హులు
లబ్ధిదారులు
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ మరియు పట్టణ ప్రాంత 8-15 సం,,లలోపు, 3-10వ తరగతి చదివే అనాథ బాలలు అందరు.
ఉపయోగాలు
ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ, నోటు పుస్తకాలు, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు వీటితో పాటు బాలురకు రూ.20/- లు మరియు బాలికలకు రూ.25 /- లు ప్రతి నెల సబ్బులు మరియు కొబ్బరి నూనె నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది.
సంప్రదించండి
ప్రధానోపాధ్యాయులు /హాస్టల్ సంక్షేమ అధికారి / జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి /సహాయ సంచాలకులు , సాంఘిక సంక్షేమం.
జి.ఓ.నెం 
 
ఆర్.సి.నెం. 126 ఎస్.డబ్ల్యు (ఇడియు.2) డిపార్ట్ మెంట్ , తేది 03 /09 / 1997
ఎస్.టి సంక్షేమ హాస్టల్స్
లక్ష్యం
ఎస్.టి.తెగల విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పించడం ద్వారా విద్యా ప్రామాణాలను పెంచడం.
అర్హత
వార్షిక ఆదాయం 12,000/- లకు మించని 3 నుంచి 10 వతరగతి మధ్య ఉన్న ఎస్.టి.విద్యార్ధులు
లబ్ధిదారులు
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు చెందిన దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 3 నుంచి 10 వతరగతి మధ్య ఉన్న విద్యార్ధులు
ఉపయోగాలు
ఉచితంగా పాఠ్య ఫుస్తకాలు, నోట్స్, భోజనం, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు వీటితో పాటు బాలురకు రూ.20/- లు మరియు బాలికలకు రూ, 25/-లు వరకు ప్రతి నెల సబ్బులు మరియు కొబ్బరి నూనె నిమిత్తం.
సంప్రదించండి
ప్రధానోపాధ్యాయులు / హాస్టల్ సంక్షేమ అధికారి/ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి/ సహాయ సంచాలకులు, సాంఘిక సంక్షేమం.
జి.ఓ.నెం
జీ.ఓ.ఎం.ఎస్.నెం. 126, ఎస్.డబ్య్లు (జి2) డిపార్ట్ మెంట్, తేది 03-09-1997
 
కిశోర బాలికల పథకం
లక్ష్యం
బాలికలను నూటికి నూరు శాతం ప్రాథమిక విద్యలో చేర్పించడం, బాల్య వివాహాలను నిరోధించడం.
అర్హత
15 సం,,లలోపు బాలికలు
లబ్ధిదారులు
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 15 సం,,లలోపు బాలికలు
ఉపయోగాలు
వివిధ నైపుణ్యాలలో శిక్షణనివ్వడం, ఇతర ప్రదేశాలను సందర్శింపజేయడం, వర్క్ షాపులు మరియు బ్రిడ్జి కోర్సులలో శిక్షణనివ్వడం.
సంప్రదించండి
అంగన్ వాడీ టీచర్ / ఐసిడియస్ సూపర్ వైజర్ / ఐసిడియస్ /పి.డి. /మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి

జీవో.యమ్.యస్.నెం. 70, యస్.డబ్య్లు (ఆర్.యస్) డిపార్ట్ మెంట్, తేది 10-7-1999
 
జాతీయ కుటుంబ సహాయక పథకం (ఎన్.ఎఫ్.బి.ఎస్)
లక్ష్యం
ఏదైనా ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద సహజ లేదా అవాంఛనీయ మరణం సంభవించినప్పుడు, ఆ కుటుంబానికి సహాయాన్ని అందించడం
అర్హత
మరణించిన కుటుంబ పెద్ద 18-25 సంవత్సరాల మధ్య వయస్కులై, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి చెందిన వాడై ఉండాలి.
లబ్ధిదారులు
కుటుంబ పెద్ద మరణించిన, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబీకులు
ఉపయోగాలు
రూ. 10,000/- ల ఆర్థిక సహాయం అది కూడా ఒకసారి మాత్రమే
సంప్రదించండి
గ్రామ పంచాయితీ కార్యదర్శి /సర్పంచ్ వెలుగు కో – ఆర్డినేటర్ / ఎం.పి.డి.ఓ./పి.డి., వెలుగు - డి.ఆర్.డి.ఎ.
2
జిఓ.ఎం.ఎస్.నెం. 751, పిఆర్ ఆర్ డి (ఆర్ డి – 1) డిపార్ట్మెంట్, తేదీ 5 -12-1995
జాతీయ కుటుంబ సహాయక పథకం (ఎన్.ఎఫ్.బి.ఎస్)
లక్ష్యం
ఏదైనా ఒక కుటుంబంలో కుటుంబ పెద్ద సహజ లేదా అవాంఛనీయ మరణం సంభవించినప్పుడు, ఆ కుటుంబానికి సహాయాన్ని అందించడం.
అర్హత
మరణించిన కుటుంబ పెద్ద 18-25 సంవత్సరాల మధ్య వయస్కులై, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి చెందిన వాడై ఉండాలి.
లబ్ధిదారులు
కుటుంబ పెద్ద మరణించిన, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబీకులు
ఉపయోగాలు
రూ. 10,000/- ల ఆర్థిక సహాయం అది కూడా ఒకసారి మాత్రమే
సంప్రదించండి
గ్రామ పంచాయితీ కార్యదర్శి /సర్పంచ్ వెలుగు కో – ఆర్డినేటర్ / ఎం.పి.డి.ఓ./పి.డి., వెలుగు - డి.ఆర్.డి.ఎ.
3
జిఓ.ఎం.ఎస్.నెం. 751, పిఆర్ ఆర్ డి (ఆర్ డి – 1) డిపార్ట్మెంట్, తేదీ 5 -12-1995
పట్టణ ప్రాంత మహిళల మరియు బాలల అభివృద్ధి (డిడబ్ల్యుసియుఏ)
లక్ష్యం
స్వయం సహాయక సంఘాలకు 50% రాయితీతో బ్యాంక్ ల ద్వారా ఆర్థిక సహాయం.
అర్హత
స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు
లబ్ధిదారులు
18-50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు
ఉపయోగాలు
50% రాయితీతో బ్యాంక్ ల ద్వారా ఋణ సహాయం.
సంప్రదించండి
మునిసిపల్ కమీషనర్ / జిల్లా కలెక్టర్
జి.ఓ.నెం
ఆర్.ఓ.సి.సం. 1421 /98 / యన్ 1. తేది 27.1.1998
పట్టణ ప్రాంత మైనారిటీ మహిళలు మరియు బాలలు అభివృద్ధి
లక్ష్యం
మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్ధిక సహాయాన్ని అందించడం ద్వారా స్వయం ఉపాధిని కల్పించి, వారిని దారిద్య్ర రేఖకు దిగువనుంచి ఎగువకు తీసుకురావడం.
అర్హత
మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తులు లేదా సంఘాలు
లబ్ధిదారులు
మైనారిటీ మహిళతో కలిసి ఏర్పడిన సంఘానికి చెందినవారై ఉండాలి. సభ్యులు తరచూ పొదుపు చేసుకుంటూ, తమ సేవింగ్సుఖాతాలో కనీసం, రూ.100/- లు కలిగి ఉండాలి.
ఉపయోగాలు
ఒక్కొక్కరికి 10 నుండి 20/- వేల రూపాయల వరకు రివాల్వింగ్ ఫండ్ ను అందజేస్తారు. ఈ మొత్తాన్ని ఆదాయవనరులను సమకూర్చుకోవడానికి వినియోగించాలి.
సంప్రదించండి
గ్రామ పంచాయితీ కార్యదర్శి/ వి.ఓ./ యమ్.పి.డి.ఓ/ ఎగ్జిక్యూటివ్ డెరెక్టర్, బి.సి.కార్పోరేషన్
జి.ఓ.నెం
జీ.ఓ.యమ్.యస్., నెం. 155, యస్.డబ్య్లు (జనరల్) డిపార్ట్ మెంట్, తేది 10-9-1997
పొదుపు మరియు ఋణ సంఘాలు
లక్ష్యం
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా చిన్న మొత్తాల్లో ఋణ సదుపాయం
అర్హత
స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు
లబ్ధిదారులు
18-50 సంవత్సరాల మధ్య వయసుకలిగిన స్వయం స్వయం సహాయక సంఘాల సభ్యులు
ఉపయోగాలు
బ్యాంకుల ద్వారా ఋణ సహాయం.
సంప్రదించండి
మున్సిపల్ కమీషనర్ /జిల్లా కలెక్టర్
జి.ఓ.నెం
ఆర్.ఓ.సి.నెం. 1421 / 98 / యన్1, తేది 27.1.1998
బాలికల రక్షణ పథకం
లక్ష్యం
బాలికల హక్కులకు పరిరక్షించడం ద్వారా వారి అభివృద్ధికి సహకరించడం
అర్హత
దారిద్య్రరేఖకు దిగువన ఉండి, ఒకే కుటుంబానికి ఇద్దరు బాలికలు ( 3 సం,,లోపు ) కలిగి ఉండటం. అనాధలు, జోగిని, బసివిని, దేవదాసి, మరియు మాతమ్మల పిల్లలకు ప్రాముఖ్యం ఇవ్వబడును.
లబ్ధిదారులు
దారిద్య్రరేఖకు దిగువన ఉండి, ఒకే కుటుంబానికి ఇద్దరు బాలికలు ( 3 సం,,లోపు ) కలిగి ఉండటం. అనాధలు, జోగిని, బసివిని, దేవదాసి, మరియు మాతమ్మల పిల్లలకు ప్రాముఖ్యం ఇవ్వబడును.
ఉపయోగాలు
ఒక బాలిక అయినట్లయితే 20 సంవత్సరాలు పూర్తిచేసుకునేవారికి రూ. 1 లక్ష పొందవచ్చు. అదే ఇద్దరు బాలికలైతే ఒక్కొక్కరికి రూ.30,000 లు పొందవచ్చు (20 సంవత్సరాల తర్వాత ). 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సం,,నికి 1200 ల స్కాలర్ షిప్ పొందవచ్చు. 3 సం,,ల వయస్సు నుండి జీవిత బీమా సౌకర్యం వర్తిస్తుంది. ఒకవేళ బాలిక ఏదైనా అవాంఛనాయ సంఘటన వలన మరణించినట్లయితే పూర్తి ఆర్ధిక సహాయం తల్లిదండ్రులకు అందించబడును.
సంప్రదించండి
అంగన్ వాడీ టీచర్ / ఐసిడియస్ సూపర్ వైజర్ / ఐసిడియస్ పి.డి./ మహిళా శిశు సంక్షేమ అధికారి.
జి.ఓ.నెం
జీవో. యమ్.యస్. నెం 16 డి.సి.డబ్య్లు అండ్ డబ్య్లు (జెజె)డిపార్ట్ మెంట్, తేది 5.5.2005
భర్త చనిపోయిన స్త్రీలకు పెన్షన్ పథకం
లక్ష్యం
దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, భర్త చనిపోయి అభాగ్య స్థితిలో ఉన్న స్త్రీలకు మరణించేంతవరకు ఆర్థిక సహాయం అందించడం.
అర్హత
వయసుతో సంబంధం లేకుండా వార్షికాదాయం రూ. 1800 /- లకన్నా తక్కువగా ఉండి, దారిద్య్ర రేఖకు దిగువున ఉండి, భర్త చనిపోయిన మహిళలు అందరూ.
లబ్ధిదారులు
పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న భర్త చనిపోయిన మహిళలు.
ఉపయోగాలు
ప్రతి నెల రూ. 100 పైగా ఆర్థిక సహాయం.
సంప్రదించండి
గ్రామ పంచాయితీ కార్యదర్శి / సర్పంచ్ / ప్రాథమిక ఆరోగ్య కేంద్రం / వెలుగు - కమ్యూనిటీ కో – ఆర్టినేటర్ / ఎం.పి.డి.ఓ. / పి.డి. వేలుగు –డి.ఆర్.డి.ఎ.
జి.ఓ.నెం
జీ.ఓ.ఎం.యస్., నెం. 34, యస్.డబ్య్లు (బి.యు.డి.)శాఖ, తేది 19-4-2005
మహిళ శిశు సంక్షేమ శాఖ
లక్ష్యం
పేద పిల్లలకు ఉచితంగా ఆహారం, బట్టలు, దుస్తులు మరియు నాన్ - ఫార్మల్ విద్యను అందించుట
అర్హత
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 6 సంవత్సరాలలోపు బాలలు
లబ్ధిదారులు
6 సంవత్సరాలలోపు వయస్సున్న, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలలు
ఉపయోగాలు
ఆహారం, దుస్తులు మరియు నాన్ – ఫార్మల్ విద్య
సంప్రదించండి
అంగన్ వాడీ టీచర్, / ఐ.సి.డి.యస్. /సూపర్ వైజర్ / ఐ.సి.డి. యస్ పి.డి./ మహిళా, శిశు సంక్షేమ అధికారి.
జి.ఓ.నెం
లభ్యం కాలేదు. ఈ కార్యక్రమం చాలా సంవత్సరాలుగా అమలులో ఉన్నది.
యువతకు శిక్షణ
లక్ష్యం
పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు నైపుణ్యాలతో కూడిన శిక్షణ నందించడం
అర్హత
కనీస విద్యార్హత 7వ తరగతి కలిగి ఉండి, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న, 18-35 సంవత్సరాల మధ్య వయసుగల పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతకు
లబ్ధిదారులు
కనీస విద్యార్హత 7వ తరగతి కలిగి ఉండి, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న, 18-35 సంవత్సరాల మధ్య వయసుగల పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతకు
ఉపయోగాలు
ఏపిఐటిసిఓ మరియు ఉపాధి పథకాల ద్వారా నైపుణ్యాలను అభివృద్ది పరిచే శిక్షణ అందించడం
సంప్రదించండి
మున్సిపల్ కమీషనర్ /జిల్లా కలెక్టర్
జి.ఓ.నెం
ఆర్.ఓ.సి.నెం. 1421 /98 /యన్1, తేది 27.1.1998
రాజీవ్ యువ శక్తి (చిన్న వ్యాపారాలు )
లక్ష్యం
నిరక్షరాస్యులైన యువతకు స్వయం ఉపాధి కల్పించుటకు ఆర్ధిక సహాయం అందచేయడం.
అర్హత
ఏ విధమైన ఉపాధిలేని నిరక్షరాస్యులైన యువత.
లబ్ధిదారులు
విద్యార్హతలేని యువతీయువకులు
ఉపయోగాలు
రూ, 7,500/- ల రాయితీ తో బ్యాంకులు ద్వారా రూ. 50,000 ల వరకు ఋణసదుపాయం.
సంప్రదించండి
గ్రామ పంచాయితీ కార్యదర్శి / యమ్.పి.డి.ఓ/ జిల్లా యువజన సంక్షేమశాఖాధికారి.
జి.ఓ.నెం
రాజీవ్ యువ శక్తి (సంఘాలు)
లక్ష్యం
విద్యార్హత కలిగి కనీసం 5 గురు సభ్యులు ఉన్నటువంటి సంఘాలకు ఆర్ధిక ,సహాయం ద్వారా స్వయం ఉపాధి కల్పించడం.
అర్హత
కనాసం 5 గురు సభ్యులు కలిగిన సంఘంలోని వారై, ఎటువంటి ఉపాధిలేని, కనీసం 9వ తరగతి వరకు (పాస్ లేక ఫెయిల్) చదువుకున్న యువతీయువకులు
లబ్ధిదారులు
సామర్థ్యం కలిగిన, ఎటువంటి, ఉపాధిలేని యువ సంఘాలు.
ఉపయోగాలు
బ్యాంకుల ద్వారా గరిష్ఠంగా రూ. 60,000 ల వరకు రాయితీతో, పరిశ్రమల ఆధారిత కార్యక్రమాల కోసం రూ. 3,00,000 /- ల వరకు ఆర్ధిక సహాయం, అదే సేవా ఆధారిత కార్యక్రమాలకోసం రూ. 40,000 /- లు వ్యాపార ఆధారిత కార్యక్రమాల కోసం రూ. 30,000/- లు రాయితీ కల్పించబడును.
సంప్రదించండి
గ్రామ పంచాయితీ కార్యదర్శి /యమ్.పి.డి.ఓ. /జిల్లా . యువజన సంక్షేమ అధికారి.
జి.ఓ.నెం
జీ.వో. నె. 51, వై.ఏ.టి. అండ్ సి(వై.యస్) డిపార్ట్ మెంట్, తేది 2 /1/ 2004
సేవా సంబంధిత పథకాల కోసం నిర్జీవ ఋణ సదుపాయం
లక్ష్యం
చదువుకొని నిరుద్యోగులైన యస్.టి.యువతకు, సేవాధారిత వ్యాపారాల కోసం ఆర్ధిక సహాయం
అర్హత
వార్షికాదాయం రూ.39,308 లకు మించని చదువుకున్న నిరుద్యోగ గ్రామీణ యస్.టి.యువత మరియు వార్షికాదాయం రూ. 54,494/- లు మించని పట్టణ యస్.టి. యువత, 18-45 సంవత్సరాల మధ్య వయస్కులై కనీసం 8వ తరగతి వరకు చదువుకొని ఉండాలి.
లబ్ధిదారులు
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని చదువుకున్న, నిరుద్యోగ యస్.టి.యువత
ఉపయోగాలు
మొత్తం యూనిట్ పెట్టుబడి రూ. 5,00,000 /- కాగా అందులో 50 % రాయితీ రూ.10,000 లపై 20% రాయితీ 30,000/- లపై, 4% వడ్డీతే, మిగిలిన మొత్తం 6 % వడ్డీతో నిర్జీవ ఋణ సదుపాయం ఉంటుంది.
సంప్రదించండి
గ్రామ పంచాయితీ కార్యదర్శి / వి.ఓ / యమ్.పి.డి.ఓ. /పి.ఓ. ఐ.టి.డి.ఏ /మార్పు చెందిన ప్రాంత అభివృద్ధి ఏజెన్సీ (యమ్.ఏ.డి.ఏ) /జిల్లా షెడ్యూల్డ్ తెగల సంక్షేమ అధికారి.
జి.ఓ.నెం
జీవో. యమ్. యస్. నెం. 76. యస్. డబ్ల్యు (టి.డబ్ల్యు.జిసిసి1) డిపార్ట్ మెంట్, తేది 21 /9/2005
స్వయం సహాయ సంఘాలకు – బ్యాంక్ రుణాలు
లక్ష్యం
స్వయం సహాయక సంఘాలు బ్యాంక్ నుండి తీసుకున్న పూర్వపు బకాయిలను సకాలంలో తిరిగి చెల్లించడం. మరియు కొత్త లేదా తిరిగి పాత గ్రూపులకు మైక్రోఫైనాన్స్ ద్వారా లబ్ది కల్పిచడం, జిల్లా పొదుపు ప్రణాళికలో స్వయం సహాయక ,సంఘాల వాటాను వృద్ధి చేయటం.
అర్హత
కనీసం ఆరు నెలల కాలం సక్రమ నిర్వహణ కలిగిన స్వయం సహాయక సంఘాలు.
లబ్ధిదారులు
ఈ క్రింది షరతులను ఆయోదించగలిగిన అన్ని స్వయం సహాయక సంఘాలు. 1)10-20 నుండి సభ్యులను కలిగి ఉండాలి ఒకవేళ శారీరక వికలాంగులు ఉన్నట్లయితే 5 గురు సభ్యుల వరకు ఉండవచ్చు. 2) కనీసం ఆరు నెలల కాలం సక్రమ నిర్వహణ కలిగి ఉండాలి. 3) గ్రూపులు తమ సొంత వనరులతో పొదుపు మరియు ఋణాల లావాదేవీలను విజయవంతంగా నిర్వహించి ఉండాలి. 4) గ్రూపులు సక్రమైన గణాంక మరియు రికార్డు విధానాలను అవలంబించగలిగి ఉండాలి. 5) సంఘం వివరాలతో కూడిన చిన్న మొత్తాల ఋణ పథకాల వివర
ఉపయోగాలు
ఆదాయాభివృద్ధి పథకాలకు సంబంధించి రూ.30,000/- ల నుండి రూ,1. లక్ష వరకు సహాయక సంఘాలు ఋణాన్ని పొందవచ్చు.
సంప్రదించండి
వ్యాపార బ్యాంకులు / ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు / వెలుగు కమ్యూనిటి కో- ఆర్డినేటర్ / ఎం.పి.డి.ఓ /పి.డి. వెలుగు – డి. ఆర్.డి.ఎ.
జి.ఓ.నెం
స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్ గార్ యోజన (ఎస్. జి.ఎస్.వై)
లక్ష్యం
ఈ కార్య క్రమం లక్ష్యం పేద మరియు నిరుపేద కుటుంబాలను దారిద్య్ర రేఖ ఎగువకు తీసుకురావటం.
అర్హత
సం,, ఆదాయం రూ.1200 /- లకు లోపు ఉన్న పేద మరియు నిరుపేద వర్గాలు ఈ కార్యక్రమానికి అర్హులు
లబ్ధిదారులు
గ్రామాల్లో జీవించే పేదలు ముఖ్యంగా ఎస్.సి., ఎస్.టి., వర్గాలవారు, మహిళలు, కొన్ని ప్రత్యేక వర్గాల వ్యక్తులు 40%, 10%, 40% మరియు 3% మేరకు లబ్ది పొందగలరు. లబ్దిదారులు వ్యక్తులు లేదా గ్రూపులు స్వయం సహాయక సంఘాలు కావచ్చు.
ఉపయోగాలు
ప్రాజెక్ట్ పెట్టబడిలో 30 ఎస్.జి.ఎస్.వై. క్రింద రాయితీ కల్పిస్తారు. గరిష్టంగా రూ 7,500/- వరకు రాయితీ ఉంటుంది. ఎస్.సి., ఎస్.,టి., ల విషయంలో 50 రాయితీ అనగా రూ. 10,000/- వరకు ఉంటుంది. స్వయం సహాయక సంఘాలకు 50% అనగా రూ.1,25,000/- వరకు రాయితీ కల్పిస్తారు.
సంప్రదించండి
గ్రామ పంచాయితీ కార్యదర్శి /సర్పంచ్ / వెలుగు కమ్యూనిటీ కో- ఆర్జినేటర్ మండల పరిషత్ అబివృద్ధి అధికారి (ఎం.పి.డి.ఓ) ప్రాజెక్ట్ డైరెక్టర్, వెలుగు జిల్లా గ్రామాభివృద్ధి శాఖ (డి.ఆర్.డి.ఎ.)
జి.ఓ.నెం
జి.ఓ.ఎం.ఎస్.నెం. 223, పిఆర్ & ఆర్ డి (ఆర్ డి -111) డిపార్ట్ మెంట్, తేదీ 18 / 6 / 2005
స్వర్ణ జయంతి షహరి రోజ్ గార్ యోజన (యస్ జెయస్ అర్ వై)
లక్ష్యం
ఆదాయోత్పత్తి కార్యక్రమాల కోసం నిరుద్యోగ యువతకు ఆర్దికసహాయం
అర్హత
18 – 50 సం,, ల మధ్య వయసు గల దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పట్టణ ప్రాంత నిరుద్యోగ యువత కనీస విద్యార్హత 7వ తరగతి.
లబ్ధిదారులు
పట్టణ ప్రాంత నిరుద్యోగ యువత
ఉపయోగాలు
15% రాయితీతో రూ.50,000/- ల వరకు బ్యాంకుల ద్వారా ఋణ సదుపాయం.
సంప్రదించండి
మున్సిపల్ కమీషనర్ /జిల్లా కలెక్టర్
జి.ఓ.నెం
ఆర్.ఓ.సి.నెం. 1421 /98 /యన్1, తేది 27.1.1998